HomeTelugu Trendingఅనసూయ 'థ్యాంక్ యూ బ్రదర్' పోస్టర్‌ రిలీజ్‌ చేసిన రానా

అనసూయ ‘థ్యాంక్ యూ బ్రదర్’ పోస్టర్‌ రిలీజ్‌ చేసిన రానా

Anasuya Thank You Brotherటాలీవుడ్‌ స్టార్‌ యాంకర్‌, నటి అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రథాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘థ్యాంక్ యూ బ్రదర్’. క్రియేటివ్ డైరెక్టర్ రమేష్ రాపర్తి కరోనా మహమ్మారి కాలానికి సంబంధించిన కాల్పనిక ఘటనలను ఆధారం రూపొందిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను హీరో రానా దగ్గుబాటి లాంచ్ చేశారు. ఈ పోస్టర్ లో ఓ లిఫ్ట్ దాని ఎదురుగా ఫ్లోర్ మీద పడి ఉన్న మాస్క్ కనిపిస్తున్నాయి. ఎలివేటర్(లిఫ్ట్)కు కథలో కీలక పాత్ర ఉందనే అభిప్రాయాన్ని పోస్టర్ కలిగిస్తోంది. టైటిల్ పోస్టర్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచేవిధంగా ఉన్నాయి. ఇప్పటికే రానా తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన వీడియోలో యూనిట్ మెంబర్స్ ను ఒక్కొక్కరిని మాస్క్ పెట్టుకోమని అడిగి వారు మాస్క్ పెట్టుకోగానే థ్యాంక్ యు బ్రదర్ అని చెప్పడం కరోనా కాలంలో మాస్క్ ప్రాధాన్యాన్ని ఇందులో చెప్తున్నట్లే కనిపిస్తోంది.

జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మాగుంట శరత్చంద్రా రెడ్డి – తారక్నాథ్ బొమ్మిరిడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో ఫస్ట్‌లుక్ ను రిలీజ్‌ చేయనున్నారు. వైవా హర్ష, అర్చనా అనంత్ , ఆదర్శ్ బాలకృష్ణ, కాదంబరి కిరణ్, అన్నపూర్ణ, సమీర్ తదితరులు ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

https://www.instagram.com/p/CHz_-YBBzLL/?utm_source=ig_web_copy_link

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu