లాస్య హీరోయిన్ అయిపోయింది!

బుల్లితెరపై తమ సత్తాను చాటి వెండితెరపై నటీనటులుగా వెలుగొందుతోన్న తారలు చాలా మందే ఉన్నారు. ఇప్పటికే పలువురు హాట్ యాంకర్స్ తమ లుక్స్ తో ఇటు బుల్లితెరను షేక్ చేస్తూ.. అటు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నారు. గతంలో కలర్స్ ప్రోగ్రామ్స్తో యాంకర్ గా వచ్చిన స్వాతి ‘అష్టాచమ్మా’ సినిమాతో హీరోయిన్ గా మారిపోయింది.

అలానే ఉదయభాను కూడా కొన్ని సినిమాల్లో నటించింది. రీసెంట్ గా అనసూయ, రష్మి, శ్రీముఖి ఇలా చాలా మంది టీవీ యాంకర్స్ హీరోయిన్స్ గా మారిపోయారు. టెలివిజన్ రంగంపై అవగాహన ఉన్న వారికి లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. యాంకర్ రవితో కలిసి ఆమె చేసి షోలు ప్రేక్షకాదరణ పొందాయి. ఈ మధ్య ఆమె షోలు చేయడం కాస్త తగ్గించిందనే చెప్పాలి.

తాజాగా ఆమె హీరోయిన్ గా పరిచయమవుతున్నారని సమాచారం. ‘రాజా మీరు కేక’ అనే సినిమా ద్వారా లాస్య సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధపడుతోంది. మరి ఈ భామ హీరోయిన్ గా ఎంత వరకు మెప్పిస్తుందో.. చూడాలి!