రష్మిని వేధిస్తున్న వారెవరూ..?

బుల్లితెర హాట్ యాంకర్ రష్మి ఇటీవలే ‘గుంటూర్ టాకీస్’ సినిమాతో హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది. తన హాట్ హాట్ అందాల ప్రదర్శనతో అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈమెకు యూత్ లో క్రేజ్ కూడా ఉంది. రష్మికి అభిమానుల సంఖ్య తక్కువేమీ లేదు. అయితే ఇప్పుడు ఆ అభిమానుల వలనే అమ్మడుకి వేధింపులు మొదలయ్యాయట. ఈ విషయం తన సన్నిహితుల వద్ద చెప్పుకొని వాపోతుందట.
 
రోజూ తన మొబైల్ కు ఫోన్ చేసి విసిగించేవారి సంఖ్య ఎక్కువవుతుందట. కనీసం 50 కి పైగా కాల్స్ వస్తున్నాయని
సమాచారం. షూటింగ్స్ తో ఎప్పుడు బిజీబిజీగా ఉండే తనకు ఈ ఫోన్ కాల్స్ తలనొప్పిగా మారాయని చెబుతోంది.
పోనీ వీటి నుండి తప్పించుకోవడానికి ఫోన్ నంబర్ మార్చాలనుకుంటే నిర్మాతలు తనను కాంటాక్ట్ చేయడానికి ఇబ్బంది
పడతారని ఆలోచిస్తుందట. ఇదొక సమస్యల మారిందని వాపోతుంది ఈ భామ. ఇండస్ట్రీలో ఉన్నవారికి ఇటువంటి సమస్యలు సాధారణమే. తగిన జాగ్రతలు తీసుకుంటే ఈ సమస్యల నుండి బయట పడొచ్చు. మరి రష్మి ఎలా బయటపడుతుందో.. చూడాలి!