కేటీఆర్ తో ప్రముఖ యాంకర్‌ భేటీ..!


ఈరోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ప్రముఖ యాంకర్ సుమ భేటీ అయ్యారు. ఇటీవల ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధించినందుకు ఆమె కేటీఆర్ కు అభినందనలు తెలిపారు. అనంతరం పలు విషయాలపై ఇరువురు చర్చించారు. సుమ మీడియాతో మాట్లాడుతూ, ఓ మంచి పనికోసం కేటీఆర్ ను సపోర్ట్ అడిగానని తెలిపారు. సమయం వచ్చినప్పుడు వాటి వివరాలు వెల్లడిస్తానని తెలిపింది. గురువారం సాయంత్రం రామ్ చరణ్ తేజ్ నటించిన వినయ విధేయ రామ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలకు యాంకర్ గా సుమ వ్యహరించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి కేటీఆర్ కూడా హజరయ్యారు.