HomeTelugu News'మా' ఎన్నికల బరిలో నరేష్‌

‘మా’ ఎన్నికల బరిలో నరేష్‌

10తెలుగు సినీ నటీనటుల సంఘం ‘మా’ లో మళ్లీ ఎన్నికల వేడి మొదలైంది. ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు శివాజీ రాజా పదవీకాలం ముగియడంతో ఆ పదవికి ఎన్నిక జరగనుంది. ఇందుకోసం సీనియర్ నటుడు నరేష్ నామినేషన్ దాఖలు చేశారు. జీవిత రాజశేఖర్ దంపతులతో పాటు తన ప్యానెల్‌తో కలిసి ‘మా’ కార్యాలయానికి వచ్చిన నరేష్ తొలుత దాసరి విగ్రహానికి నివాళులర్పించి ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ‘మా’ అసోసియేషన్ ఎన్నికలపై నరేష్, జీవిత రాజశేఖర్‌ స్పందించారు. నటీనటుల సంఘంలోని గత సభ్యుల పనితీరును తప్పుపట్టారు. అసోసియేషన్‌లో అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవం కానందునే.. సినీ పెద్దలు, సభ్యుల కోరిక మేరకు పోటీ చేస్తున్నట్లు నరేష్ స్పష్టం చేశారు. మొత్తం 800 మందికిపైగా సభ్యులున్న నటీనటుల సంఘానికి మార్చి 10న ఎన్నికలు జరగనున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu