ఏంజెల్ తమిళ వెర్షన్ పాటలు విడుదల!

శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై నాగాఅన్వేష్, హెబ్బాపటేల్ జంటగా నటించిన చిత్రం ‘ఏంజెల్’. సోషియోఫాంటసీ స్టోరీతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు రాజమౌళి శిష్యుడు, నూతన దర్శకుడు బాహుబలి పళని. దాదాపు 40 నిమషాలకి పైగా గ్రాఫిక్స్ హంగులతో రెడీ అవుతున్న ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోకి విడుదల చేస్తున్నట్లుగా చిత్ర బృందం ఇది వరకే ప్రకటిచింది. ఈ నేపథ్యంలో తాజాగా జూలై 12న ‘ఏంజెల్’ తమిళ వెర్షన్ ‘విన్నైతాండి వందా ఏంజెల్’ ఆడియోను రిలీజ్ చేశారు. చెన్నైలో తమిళ పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖల సమక్షంలో విన్నైతాండి వందా ఏంజెల్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో విసి.భుగానాదన్ (డైరెక్టర్), ఆర్వీ ఉదయ్ కుమార్ (డైరెక్టర్), దేవయాని రాజకుమారన్ (డైరెక్టర్), జాక్వార్ థంగమ్(గిల్డ్ ప్రెసిడెంట్), భారతీయ గణేశణ్ (డైరెక్టర్) తో పాటు చిత్ర హీరో నాగ అన్వేష్, హీరోయిన్ హెబ్బాపటేల్, నిర్మాతలు సింధూర పువ్వు కృష్ణారెడ్డి, భువన్ సాగర్, దర్శకుడు బాహుబలి పళని పాల్గొన్నారు. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటాయని, తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమా విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉందని దర్శకుడు పళని తెలిపారు. ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ లో బిజీగా ఉన్న ఈ సినిమాను అతి త్వరలో విడుదల చేసేందుకు సన్నాహలు చేస్తున్నట్లుగా నిర్మాతలు ప్రకటించారు.