విక్రమ్ తో చైతు హీరోయిన్!

నాగచైతన్య నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన మలయాళీ భామ మంజీమా మోహన్. చూడడానికి కాస్త బొద్దుగా ఉన్నా.. తన నటనతో ఓకే అనిపించుకుంది. దీంతో అమ్మడుకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా విక్రమ్ సినిమాలో నటించే అవకాశం మంజీమాకు దొరికినట్లు తెలుస్తోంది.

‘ఇంకొక్కడు’ సినిమాతో సక్సెస్ కొట్టిన విక్రమ్ ఇప్పుడు మరింత ఉత్సాహంతో విజయ్ చంద్రశేఖర్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అయిపోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట సాయి పల్లవిని అనుకున్నారు.

అయితే అమ్మడు పెట్టే కండీషన్స్ కు నిర్మాతలు తట్టుకోలేక మరో ఆప్షన్ కోసం వెతుకుతున్నారు. ఈ నేపధ్యంలో మంజిమా అయితే సినిమాకు బాగుంటుందనే ఇర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయమై ఆమెతో చర్చలు జరుపుతున్నారు. ఆమె కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.