
సందీప్ రెడ్డి డైరెక్షన్‌లో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న చిత్రం ‘యానిమల్’. ఈ ప్యాన్ ఇండియా సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. అర్జున్ కపూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్ తోపాటు, రీసెంట్ గా విడుదల చేసిన అనిల్ కపూర్, రష్మిక, బాబీ డియోల్ ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆకట్టుకున్నాయి.
ఈ రోజు రణబీర్ కపూర్ పుట్టిన రోజు సందర్భంగా.. ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో హీరో తండ్రి బల్బీర్ సింగ్ పాత్రలో అనిల్ కపూర్ నటిస్తుండగా, భార్య గీతాంజలిగా రష్మిక నటిస్తోంది. ఈ ట్రైలర్ మొత్తం చాలా ఆసక్తికరంగా సాగింది.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచింది. ఈ ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించేలా ఉంది. బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించారు. భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్‌కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది.













