అంజలి ఆ హీరోతో సహజీవనం చేస్తోందట!

జర్నీ సినిమాలో కలిసి నటించిన జై, అంజలి ల మధ్య అప్పటినుండే ప్రేమ వ్యవహారం నడుస్తోందని టాక్. ఈ విషయమై వీరిద్దరూ అవుననీ చెప్పలేదు.. అలా అని కాదనీ అనలేదు. గత నాలుగేళ్లుగా వీరి మధ్య ప్రేమ కథ నడుస్తోందని అంజలి, జైతో సహజీవనం చేస్తోందని తాజా సమాచారం. అసలు విషయంలోకి వస్తే జ్యోతిక నటిస్తోన్న ‘మగలిర్ ముట్టం’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సూర్య, జ్యోతిక కోసం ఓ దోశ వేసి మీరు మీకు ఇష్టమైన వారి కోసం దోశ వేయండని ఛాలెంజ్ చేశాడు.

ఈ ఛాలెంజ్ ను స్వీకరించిన జై.. అంజలి కోసం దోశ ప్రిపేర్ చేశాడు. ఆ ఫోటోలను సైతం షేర్ చేశాడు. దీంతో ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారనే వార్త ఊపందుకుంది. మరి దీనిపై ఈ జంట స్పందిస్తుందో.. లేక ఎప్పటిలానే లైట్ తీసుకుంటుందో.. చూడాలి!