మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో ఎంట్రీ

మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే అనేక మంది హీరోలొచ్చారు. గత ఏడాది చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ సైతం హీరో కాగా ప్రస్తుతం ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ డెబ్యూ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. నెక్స్ట్ అల్లు అరవింద్ కుటుంబం తరపున విరాన్ ముత్తంశెట్టి అనే కుర్రాడు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతని డెబ్యూ సినిమా పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ కూడా మొదలవుతుందట.