
రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా పాన్ ఇండియాగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇద్దరు చారిత్రక యోధుల కథతో వస్తున్న ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒలీవియో మోరిస్, రామ్‌చరణ్ పక్కన అలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీళ్లతో పాటు ఈ సినిమాలో మరో హీరోయిన్ నటిస్తున్నట్లు తాజా సమాచారం. ఎన్టీఆర్ పక్కన మరో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. గిరిజన యువతి పాత్ర చేయనుందట.













