‘బిగ్ బాస్-3’లో తన అందంతో పిచ్చెక్కించనున్న బీజేపీ అభ్య‌ర్థి

తెలుగులో ‘బిగ్ బాస్’ సీజ‌న్-3 ఇంకా మొద‌లు కాలేదు కానీ మొద‌ల‌య్యే ముందే రోజుకో కొత్త సంచ‌ల‌నం సృష్టిస్తుంది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త వార్త‌లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. దీనికి హోస్ట్ ఎవ‌రు అని ఓ సారి వార్త‌లు వ‌స్తే.. మ‌రోసారి రేణు దేశాయ్ వ‌స్తుంద‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఇక ఇప్పుడు మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్త బ‌య‌టికి వ‌చ్చింది. ఈ సారి హౌస్‌ లోకి ఓ ఎమ్మెల్యే అభ్య‌ర్థి రాబోతుంద‌ని తెలుస్తుంది. అయితే ఆమె రాజ‌కీయ నాయ‌కురాలే కాకుండా హీరోయిన్ కూడా. దాంతో ఈమెకు కూడా అక్క‌డ ఛాన్స్ ఇస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.

మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఏపీలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుండి బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన హీరోయిన్ మాధవీలతా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌ లోకి వ‌స్తుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. రాజ‌కీయాలు పెద్ద‌గా క‌లిసి రాక‌పోవ‌డంతో ఇప్పుడు త‌న సినిమా కెరీర్ మీద ఫోక‌స్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. న‌చ్చావులే సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత కొన్ని సినిమాలు చేసినా పెద్ద‌గా గుర్తింపు అయితే రాలేదు.

దాంతో రాజ‌కీయాల్లోకి వెళ్లిపోయింది ఈ బ్యూటీ. అక్క‌డ కూడా అదృష్టం క‌లిసిరాక‌పోవ‌డంతో ఈ అమ్మ‌డు మ‌ళ్లీ బుల్లితెర‌పై దృష్టి పెడుతుంది. ప్రేక్ష‌కుల‌కు ఇప్పుడు చేరువ కావాలంటే బిగ్ బాస్ షోను మించిన ఆప్ష‌న్ కూడా మ‌రోటి లేదు. అందుకే అవ‌కాశం రాగానే మ‌రో ఆలోచ‌న లేకుండా ఇంట్లోకి వెళ్ల‌డానికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.