HomeTelugu Trending'మహర్షి' న్యూ అప్డేట్

‘మహర్షి’ న్యూ అప్డేట్

3 28సుపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటిస్తున్న ‘మహర్షి’ సినిమా రిలీజ్ తేదీకి దగ్గర పడుతుండటంతో ఈ సినిమా నుంచి ఒక్కో స్టిల్ ను విడుదల చేస్తున్నారు. ఫస్ట్ సింగిల్ చోటి చోటి సాంగ్ ను మార్చి 29 వ తేదీన విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఆ సాంగ్ కు సంబంధించిన ఓ స్టిల్ రిలీజ్ అయింది.

ఈరోజు ఆ సాంగ్ కు సంబంధించిన మరో ఫోటోను రిలీజ్ చేశారు. మహేష్ బాబు, అల్లరి నరేష్ లు చెరోవైపు ఉండగా మధ్యలో పూజా హెగ్డే ఉన్న ఫోటో. ఈ ఫోటోను బట్టి సాంగ్ ను ముగ్గురిపై షూట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మహర్షి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu