HomeTelugu Trending'అంటే సుందరానికి' పిక్‌ వైరల్‌

‘అంటే సుందరానికి’ పిక్‌ వైరల్‌

Ante sundaraniki movie stil
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నతాజా చిత్రం ‘అంటే సుందరానికి’. మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా ఫర్హద్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు రిలీజ్ డేట్స్ ను ప్రకటించి.. ఆవకాయ సీజన్ లో తమ ఆగమనం ఎప్పుడైనా ఉండొచ్చని దర్శక నిర్మాతలు తెలిపారు. తాజాగా ఈ సినిమాలోని ఓ సాంగ్ పిక్చరైజేషన్ కు సంబంధించిన కొన్ని స్టిల్స్ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరోహీరోయిన్ల తో పాటు ఫుల్ ఎనర్జిటిక్ గా మాస్ అప్పీల్ తో ఉన్నట్టు కనిపిస్తున్న ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. సినిమా ద్వితీయార్థంలో ప్రీ క్లయిమాక్స్ లో వచ్చే సాంగ్ లాగా దీన్ని చూస్తుంటే అనిపిస్తోంది. మరి ఈ పాట ఇప్పటికే వైరల్ అవుతున్న నేపథ్యంలో అధికారికంగా సాంగ్ వివరాలు, పిక్చరైజేషన్ కు సంబంధించిన విశేషాలను నిర్మాతలు తెలియచేస్తారేమో చూడాలి.

సర్కారువారి పాట: కళావతి సాంగ్‌ విడుదల

Recent Articles English

Gallery

Recent Articles Telugu