‘అంతరిక్షం’ దీపావళి స్పెషల్‌!

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన సినిమా ‘అంతరిక్షం 9000 కె.ఎమ్‌.పి.హెచ్‌’. సంకల్ప్‌ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి, అదితి రావు హైదరి హీరోయిన్లు గా నటించారు. ఈ రోజు దీపావళిని పురస్కరించుకుని చిత్రబృందం ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. పోస్టర్‌లో లావణ్య తెలుగింటి అమ్మాయిలా లంగావోణీ వేసుకుని దీపాలు వెలిగిస్తూ..పక్కనే నిలబడి ఉన్న వరుణ్‌ తేజ్‌ను చూస్తున్నట్లు కనిపించారు.

క్రిష్‌, సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చిత్రీకరణ పూర్తైంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు మంచి స్పందన లభించింది. తెలుగులో అంతరిక్షం నేపథ్యంలో వస్తున్న పూర్తిస్థాయి చిత్రమిదే. అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమాను రూపొందించారు. డిసెంబర్‌ 21న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.