‘అనుభ‌వించు రాజా’ మూవీ రివ్యూ

Anubhavinchu Raja Movie Review

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రాజ్‌త‌రుణ్ నటించిన తాజా చిత్రం ‘అనుభ‌వించు రాజా’.ప్రచార చిత్రాలు ఆస‌క్తిని రేకెత్తించేలా ఉండ‌టం, అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఈ సినిమా వ‌స్తుండ‌టంతో సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్పడాయి.

కథ: బంగారం అలియాస్ రాజు (రాజ్‌త‌రుణ్‌) పెద్దింట్లో పుట్టి పెరిగిన కుర్రాడు. త‌న తాత చివ‌రి వ‌ర‌కూ సంపాద‌న‌కే ప‌రిమిత‌మై త‌నకంటూ జ్ఞాప‌కాలేమీ లేకుండా త‌నువు చాలిస్తాడు. తన చివ‌రి క్షణాల్లో నువ్వైనా బాగా అనుభ‌వించు అని మ‌న‌వ‌డికి చెప్పి ప్రాణాలు వదిలేస్తాడు. అప్పట్నుంచి బంగారం జల్సారాయుడిగా మార‌తాడు. అనుభ‌వించ‌డానికే పుట్టాన‌న్నట్టుగా కోడిపందేలు, స‌ర‌దాలతో కాలం వెల్లదీస్తుంటాడు. ఊరికి ప్రెసిడెంట్ కావాల‌నుకుంటాడు. ఎన్నిక‌ల హ‌డావుడిలో ఓ హ‌త్య కేసులో ఇరుక్కుంటాడు. ఇంత‌కీ ఆ హ‌త్య ఎవ‌రు చేశారు? ఊళ్లో జ‌ల్సాగా బ‌తికిన బంగారం సిటీలో సెక్యూరిటీ గార్డ్ ఎందుక‌య్యాడు? శృతి (క‌శిష్‌ఖాన్‌)తో అత‌డి ప్రేమాయ‌ణం ఎలా సాగిందన్నది మిగ‌తా క‌థ‌.


నటీనటులు: రాజ్‌త‌రుణ్ తన పాత్రలో ఆక‌ట్టుకుంటుంది. ప్రథ‌మార్ధంలో సెక్యూరిటీ గార్డ్ రాజుగా, సుద‌ర్శన్‌తోనూ, హీరోయిన్‌ క‌శిష్‌ఖాన్‌తో క‌లిసి చేసిన సన్నివేశాలు కూడా స‌ర‌దాగా అనిపిస్తాయి. అజ‌య్ పాత్ర, ఆయ‌న న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. హీరోయిన్‌ క‌శిష్‌ఖాన్ అందంగా క‌నిపించింది. పాట‌లు, చిత్రీక‌ర‌ణ మెప్పిస్తుంది. ద‌ర్శకుడు శ్రీను గ‌విరెడ్డి రాసుకున్న క‌థ‌లో బ‌లం ఉంది కానీ, క‌థ‌నం అంతగా మెప్పించ‌లేదు. మాట‌లు కూడా బాగున్నాయి.

విశ్లేషణ: ప‌ల్లెటూరు.. అక్కడి కొన్ని కుటుంబాల‌తో ముడిప‌డిన క‌థ ఇది. కామెడీ, డ్రామాకి అవ‌కాశం ఉన్న క‌థ‌. ప్రథ‌మార్ధం హైద‌రాబాద్, ద్వితీయార్ధం ప‌ల్లెటూరు నేప‌థ్యంలో సాగుతుంది. సెక్యూరిటీ గార్డ్‌గా హీరో ఉద్యోగంలో చేర‌డం, అక్కడ హీరోయిన్‌తో ప‌రిచయం కావ‌డం, ఆ త‌ర్వాత ఇద్దరి మ‌ధ్య ప్రేమ పుట్టడం వంటి స‌న్నివేశాల‌తో సినిమాని స‌ర‌దాగా న‌డిపే ప్రయ‌త్నం చేశారు. కానీ, ఆ స‌న్నివేశాల్లో అంత బ‌లం లేక‌పోవ‌డంతో పెద్దగా వినోదం పండ‌లేదు. విరామ స‌మ‌యంలో వ‌చ్చే స‌న్నివేశాలు క‌థ‌లో కీల‌క మ‌లుపుకి కార‌ణ‌మ‌వుతాయి. హీరోలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తాయి. ద్వితీయార్ధంలో ఫ్లాష్‌బ్యాక్ ఏదో ఉంద‌నే విష‌యాన్ని స్పష్టం చేస్తాయి.

క‌థ ప‌ల్లెటూరికి వెళ్లాకైనా కామెడీ డోస్ పెరుగుతుందేమో అని ఆశిస్తే అక్కడ కూడా నిరాశే. చూసేసిన కోడి పందేలు, ఒకే రకమైన సంద‌డి. కాక‌పోతే ఇక్కడ ప్రెసిడెంట్ కుటుంబంలోని డ్రామా, హ‌త్య వెన‌క ఎవ‌రున్నార‌నే విష‌యంపై రేకెత్తించిన ఆస‌క్తి ప్రేక్షకుల్ని క‌ట్టి ప‌డేస్తాయి. ప‌తాక స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. అక్కడ‌క్కడా న‌వ్వించే కొన్ని స‌న్నివేశాలు, హుషారుగా సాగే పాట‌లే చిత్రానికి ప్రధాన ఆక‌ర్షణ‌.


టైటిల్‌ : అనుభవించు రాజా
నటీనటులు : రాజ్ త‌రుణ్‌, క‌షీష్ ఖాన్‌, పోసాని కృష్ణ ముర‌ళి, ఆడుగ‌ల‌మ్ న‌రేన్‌, అజ‌య్‌, సుద‌ర్శ‌న్‌ తదితరులు
దర్శకత్వం: శ్రీను గవిరెడ్డి
నిర్మాణ సంస్థ: అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి
నిర్మాత: సుప్రియ యార్లగడ్డ
సంగీతం : గోపీసుంద‌ర్

హైలైట్స్‌‌: కొన్ని స‌ర‌దా స‌న్నివేశాలు
డ్రాబ్యాక్స్‌‌:కామెడీ త‌గ్గడం
చివరిగా: అక్కడక్కడా నవించే రాజా
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

CLICK HERE!! For the aha Latest Updates