HomeTelugu Trending'అనుభవించు రాజా' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘అనుభవించు రాజా’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Anubhavinchu raja Release o
టాలీవుడ్‌ యంగ్‌ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం “అనుభవించు రాజా”. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ జూదగాడిగా, బాధ్యత తెలియని యువకుడిగా, కేవలం లైఫ్ ను ఎంజాయ్ చేయడానికే పుట్టినట్టుగా కనిపించే పాత్రను పోషిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. టైటిల్ సాంగ్ కూడా అందరినీ ఆకట్టుకుంది. తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.

“అనుభవించు రాజా” నవంబర్ 26న థియేటర్లలోకి రానుంది. దీంతో “అనుభవించు రాజా” ప్రమోషన్లలో దూకుడు పెంచనుంది. ఈ సినిమాకి శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించగా, సుప్రియ యార్లగడ్డ అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌లపై నిర్మించారు. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu