
‘ప్రేమమ్’ మూవీతో మూవీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. ఈ బ్యూటీ చేసింది కొన్ని సినిమాలే అయినా అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. సినిమాల్లో డిసెంట్ రోల్స్ ఎంచుకుంటూ అందం, అభినయంతో ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. సోషల్ మీడియాలో ఎక్టీవ్‌గా ఉంటే.. ఈ బ్యూటీ తరచూ తన ఫొటోలను, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది. ఈ క్రమంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇటీవల రౌడీబాయ్స్ మూవీతో సందడి చేసిన అనుపమ ప్రస్తుతం కార్తికేయ 2, 18 పేజీస్, బటర్ ఫ్లై సినిమాల్లో నటిస్తోంది.
తాజాగా ఈ క్యూటీ.. ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రిలేషన్‌షిప్‌పై ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘నాకు లవ్ మ్యారేజ్‌పై మంచి అభిప్రాయమే ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న కపుల్స్‌ను చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది. నాకు కూడా ప్రేమ వివాహమే చేసుకోవాలని ఉంది. మా పేరేంట్స్‌కు కూడా ఈ విషయం తెలుసు. నేను పెళ్లంటు చేసుకుంటే కచ్చితంగా లవ్ మ్యారెజే చేసుకుంటా. నేను సింగిల్.. కాదు మింగిల్.. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే నా రిలేషన్‌షిప్ స్టేటస్ నాకు కూడా సరిగ్గా తెలియట్లేదు. నేనైతే ప్రేమలో ఉన్నా.. మరి అవతలి సైడ్ నుంచి ఏమనుకుంటున్నారో తెలియదు. ప్రస్తుతం వన్ సైడ్ లవ్ అని చెప్పగలను.’ అంటూ తెలిపింది అనుపమ పరమేశ్వరన్.













