HomeTelugu Trendingతల్లిదండ్రులతో స్వీటీ.. ఫొటో వైరల్‌

తల్లిదండ్రులతో స్వీటీ.. ఫొటో వైరల్‌

7 19
కారోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దాంతో అందరు ఇళ్లకే పరితమైయ్యారు. ఇంకా ఎన్ని రోజులు ఈ పరిస్థితి ఉంటుందో కూడా చెప్పలేం. సెలబ్రెటిలకు సైతం ఇదే పరిస్థితి. సినిమా షూటింగ్‌లు లేకపోవడంతో వారు కొత్తకొత్త ఛాలెంజ్‌లు చేస్తు, వారి ఫొటోలను షేర్‌ చేస్తూ.. అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు. తాజాగా అనుష్క కూడా ఇదే చేసింది. తన తల్లిదండ్రులను పరిచయం చేసింది ఈ బ్యూటీ. ఏప్రిల్ 20న తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా తల్లిదండ్రులతో తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో పేరెంట్స్‌తో పాటు సంఫ్రదాయ చీరకట్టులో కనిపించింది అనుష్క. అప్పుడప్పుడూ వాళ్ల అన్నయ్యలతో దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తుంటుంది అనుష్క. కానీ అమ్మానాన్నలను మాత్రం చూపించలేదు. ఇన్నేళ్ళకు తమ పేరెంట్స్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది స్వీటి.

ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం అనుష్క నిశ్శబ్ధం సినిమాలో నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ పూర్తైపోయింది.. లాక్‌డౌన్ తరువాత ఈ సినిమా రిలీజ్‌ అవుతుంది. ఇందులో మాధవన్ హీరోగా నటించగా.. హీరోయిన్లు అంజలి, శాలిని పాండే కీలక పాత్రల్లో నటించారు. హాలీవుడ్ నటుడు మ్యాడిన్సన్ విలన్‌గా నటించాడు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!