తెలుగు రాష్ట్రాల్లో కరోనా అప్‌డేట్


తెలంగాణలో ఇవాళ 40 కొత్త కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా 40 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 1454కి చేరింది. ఇవాళ నమోదైన పాజిటివ్ కేసుల్లో 33 మంది హైదరాబాద్‌కు చెందిన వారే. రోజు రోజుకూ హైదరాబాద్‌ పరిధిలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా బారినపడి 34 మంది ప్రాణాలు కోల్పోయారు. 959 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇవాళ మరో 13 మంది డిశ్చార్జి కాగా 461మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు.

ఏపీలో ఇవాళ కొత్తగా 57 పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 57 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2157కి చేరింది. కరోనా బారిన పడి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి కోలుకుని 1252 మంది డిశ్చార్జి కాగా, 857మంది చికిత్సపొందుతున్నారు.

కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో నెల్లూరు 14, చిత్తూరు 14, కృష్ణా 9, కర్నూలు 8, అనంతపురం 4, కడప 2, విశాఖ 2 తూ.గో జిల్లాలో ఒకటి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 9,038 మందికి పరీక్షలు నిర్వహించగా 102 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో 45 మంది కేసులు ఇతర రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తించారు. (మహారాష్ట్ర 34, రాజస్థాన్ 11)