నితిన్ సినిమాలో అర్జున్!

నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. 14 రీల్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో సీనియర్ నటుడు అర్జున్ కనిపించబోతున్నారు. ఈ సంధర్భంగా..

నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. ”ఈ సినిమాలో సీనియర్ నటుడు అర్జున్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. సినిమాలో ఇది చాలా కీలమైన పాత్ర. దీనికోసం మూడు నెలలు ఆలోచించాం. అర్జున్ గారు మాత్రమే ఈ పాత్రకు న్యాయం చేయగలరనిపించింది. చాలా స్టైలిష్ గా
ఉండే రోల్. ఈ సినిమాతో తెలుగులో మరోసారి ఆయన మార్క్ ను క్రియేట్ చేయడం ఖాయం” అన్నారు

దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ.. ”నాలుగు నెలల క్రితం కథ రాసుకుంటున్నప్పుడు.. అర్జున్ గారి పాత్రలో ఆయన్ను తప్ప మరెవరిని ఊహించుకోలేకపోయాను. చిన్నప్పుడు యాక్షన్ సినిమాలు బాగా చూసేవాడ్ని. ఆయన జెంటిల్ మెన్ సినిమా చూసి ఫ్యాన్ అయిపోయాను.
అదృష్టం కొద్దీ ఈ సినిమాలో ఆయనతో కలిసి పని చేసే అవకాశం వచ్చింది. ఇది ఆయనతో మొదలయ్యే కథ. తన కథ.. టెరిఫిక్ రోల్. అర్జున్ గారు తప్ప మరెవరూ చేయలేరనిపించింది. మొదట ఆయనకు ఈ కథ చెప్పడమే పెద్ద టాస్క్. ఒప్పుకుంటారో.. లేదో అనుకున్నాం. కానీ ఆయన కథ విని ఓకే చెప్పగానే ఎంతో ఎగ్జైట్ అయ్యాను. ఆయన అడుగు సినిమాను మొత్తం మార్చేస్తుంది. నా లైఫ్ టైమ్ లో రాసిన బెస్ట్ రోల్ ఇదే అవుతుంది” అన్నారు.

సీనియర్ నటుడు అర్జున్ మాట్లాడుతూ.. ”నటుడికి మంచి పాత్ర వచ్చినప్పుడు ఎంతో ఎగ్జైట్ అవుతారు. ఈ రోల్ వినగానే నేను ఎంతగానో ఎగ్జైట్ అయ్యాను. రెండు నెలల్లో ఓ పాతిక కథలు విన్నాను. కానీ ఏ కథ నన్ను ఎగ్జైట్ చేయలేదు. ఈ కథ నచ్చింది. ఒకేఒక్కడు, జెంటిల్ మెన్ సినిమాలతో ఎటువంటి గుర్తింపు లభించిందో.. ఈ సినిమాతో అంత మంచి గుర్తింపు లభిస్తుంది” అన్నారు.