HomeTelugu Newsకరోనాకు మరో అర్థం చెప్పిన మోడీ

కరోనాకు మరో అర్థం చెప్పిన మోడీ

13 13
భారత్‌ ప్రధాని నరేంద్రమోడీ కరోనా వైరస్‌కు సరికొత్త నిర్వచనం చెప్పారు. కరోనాను దేశ ప్రజల్లో కొంతమంది ఇప్పటికీ అంత సీరియస్‌గా తీసుకోవడం లేదనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించారు ప్రధాని నరేంద్రమోడీ. కరోనా అంటూ కోయి రోడ్ పర్ నా నిక్‌లే అంటూ కొత్త అర్థం చెప్పారు. తెలుగులో కరోనా అంటూ రోడ్డు మీదకు ఎవరూ రావొద్దని దీని అర్థం. ఇందుకు సంబంధించిన ఓ ఫ్లకార్డును తన కూడా మీడియా సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రదర్శించారు.

రాబోయే 21 రోజులు దేశానికి ఎంతో కీలక కానున్నాయని చెప్పిన మోదీ… ప్రజలెవరూ ఇల్లు దాటి బయటకు రావొద్దని పదే పదే చేతులు జోడించి మరీ విజ్ఞప్తి చేశారు. కరోనా సంక్రమించిందన్న విషయం ముందు ఎవరూ గుర్తించలేరన్నారు. వ్యాధి లక్షణాలున్న వారే కాకుండా అందరూ సామాజిక దూరం పాటించాలని అన్నారు. మీ కుటుంబ సభ్యుడిలా చెబుతున్నానని, ఈ మూడు వారాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఆయన అన్నారు. ఒక వ్యక్తి నుంచి వేల మందికి వైరస్‌ వ్యాపించవచ్చని అన్నారు. 11 రోజుల్లోనే లక్ష నుంచి రెండు లక్షల మందికి సోకిందని డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాలు వెల్లడించాయని చెప్పారు ప్రధాని.

Recent Articles English

Gallery

Recent Articles Telugu