HomeTelugu Newsహర్భజన్‌ సింగ్‌తో అర్జున్‌ 'ఫ్రెండ్‌షిప్‌'

హర్భజన్‌ సింగ్‌తో అర్జున్‌ ‘ఫ్రెండ్‌షిప్‌’

9 17

హర్భజన్‌ హీరోగా రూపొందుతున్న రూపొందుతున్న ‘ఫ్రెండ్‌షిప్‌’. జాన్‌ పాల్‌ రాజ్‌, శ్యామ్‌ సూర్యల సంయుక్త దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రలో.. తమిళ బిగ్‌బాస్‌ ఫేమ్‌ మరియనేసన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాని జేపీఆర్‌, స్టాలిన్‌లు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్‌ను చిత్ర బృందం తెలియజేసింది.

ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర చేయడానికి యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ అంగీకరించారని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. అర్జున్‌తో పాటు తమిళ నటుడు సతీష్‌ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేయనున్నారు. మిగతా తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ సినిమాను ఈ ఏడాది వేసవిలో పలు భారతీయ భాషల్లో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu