HomeTelugu Trendingఆంజనేయస్వామి ఆలయం నిర్మించిన హీరో అర్జున్‌

ఆంజనేయస్వామి ఆలయం నిర్మించిన హీరో అర్జున్‌

Arjun hanuman temple inaugu
యాక్షన్‌ హీరో అర్జున్‌ సర్జా తమిళనాడులోని చెన్నైలో ఆంజనేయస్వామి ఆలయం నిర్మించాడు. 15 ఏళ్ల క్రితం తలపెట్టిన గుడి నిర్మాణం ఇప్పుడు పూర్తయిందని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో వీడియో విడుదల చేశాడు. ”నేను 15 ఏళ్లుగా నిర్మిస్తున్న ఆంజనేయస్వామి గుడి నిర్మాణం పూర్తయింది. ఈ సందర్భంగా జూలై 1, 2 తారీఖుల్లో కుంభాభిషేకం జరుపుతున్నాం”

“నా కుటుంబం, స్నేహితులు, అభిమానులు అందరినీ పిలిచి ఈ వేడుకను చాలా గ్రాండ్‌గా చేద్దామనుకున్నా. కానీ కరోనా పరిస్థితుల వల్ల ఎవరికీ ఆహ్వానం పంపలేకపోతున్నా. అయినప్పటికీ ఈ వేడుకను ఎవరూ మిస్‌ కావద్దన్న ఉద్దేశ్యంతో దీన్ని లైవ్‌ స్ట్రీమ్‌ చేస్తున్నాం” అని చెప్పుకొచ్చాడు. కాగా అర్జున్‌ ప్రస్తుతం సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా నటిస్తున్న’సర్కారు వారి పాట’ సినిమాలో పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌లా నటిస్తున్నట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu