HomeTelugu Trendingమాస్‌ మహరాజ్‌తో యాక్షన్‌ కింగ్ అర్జున్

మాస్‌ మహరాజ్‌తో యాక్షన్‌ కింగ్ అర్జున్

Arjun in Khiladi

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఖిలాడి. ఈ చిత్రంలో ప్రముఖ సీనియర్ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్టు చిత్రబృందం తెలిపింది. ఖిలాడి సెట్‌లో తీసుకున్న అర్జున్‌ తన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లు. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్నిసత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu