HomeTelugu Trendingబాలయ్యకు విలన్‌గా నేషనల్‌ అవార్డు విన్నర్‌

బాలయ్యకు విలన్‌గా నేషనల్‌ అవార్డు విన్నర్‌

Arjun Rampal to take on Balakrishna in NBK108
నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఆయన నటించిన అఖండ, వీరసింహా రెడ్డి తో బ్లాక్‌ బస్టర్‌ ఖాతాలో వేసుకున్నాడు. అదే జోష్‌తో అనీల్‌ రావిపూడి సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ కూడా మొదలైపోయింది. ఇక ఈ సినిమలో బాలయ్య తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఆయన లుక్స్‌కు విశేష స్పందన వచ్చింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన బిగ్‌ అప్‌డేట్‌ను మేకర్స్‌ ప్రకటించారు. ఈ సినిమాలో నేషనల్ అవార్డు విన్నర్‌ రామ్‌పాల్ నటించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. హిందీ చిత్ర సీమలో తిరుగులేని నటుడిగా కొనసాగుతున్న అర్జున్‌ రామ్‌పాల్ ‘రాక్‌ ఆన్‌’ సినిమాకు ఉత్తమ సహాయనటుడిగా నేషనల్‌ అవార్డు గెలుచుకున్నాడు. ఇక తెలుగులో ఇప్పటికే పవన్‌తో కలిసి ‘హరిహర వీరమల్లు’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు.

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాల‌య్య 45 సంవ‌త్సరాలున్న తండ్రి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినమాలో క్రేజీ బ్యూటీ శ్రీలీల బాల‌య్య కూతురుగా నటించనుంది. ఈ సినిమా మొత్తం ఫాద‌ర్-డాట‌ర్ ఎమోష‌న్‌తో సాగుతుంద‌ని అనీల్ ఓ సందర్భంలో తెలిపాడు. ఇక బాల‌కృష్ణకు జోడీగా కాజల్‌ న‌టించ‌నుంద‌ని టాక్‌. షైన్ స్క్రీన్ ప‌తాకంపై సాహు గార‌పాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. వీలైనంత త్వరగా షూటింగ్‌ పూర్తి చేసి దసరాకు ఎట్టిపరిస్థుతుల్లో సినిమాను రిలీజ్‌ చేసేలా మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట.

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu