వరుసగా మెగాహీరోల సినిమాలు!

alll
 
సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకు ఉన్న క్రేజ్ వేరు. వారి సినిమాలు రిలీజ్ అవుతుంటే మెగాభిమానులకు పండగే.. అలాంటిది మెగా ఫ్యామిలీలో హీరోల సినిమాలన్నీ వరుసగా రిలీజ్ అవుతున్నాయంటే.. ఇక ఆ సంతోషం మాటల్లో చెప్పలేం. ఇప్పుడు మెగాఫ్యాన్స్ అదే ఆనందంలో ఉన్నారు. చిరంజీవి రీఎంట్రీ ఇస్తోన్న ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో చేయబోయే సినిమా ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేయనున్నారని సమాచారం. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డాలీ దర్శకత్వంలో చేయబోయే సినిమాను మార్చ్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ కు ఏప్రిల్ సెంటిమెంట్ బాగా ఉంది. సో.. హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోయే చిత్రాన్ని ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి తప్పకుండా బన్నీ ప్లాన్ చేస్తాడు. సాయి ధరం తేజ్ తాజా చిత్రాన్ని మే నెలలో విడుదల చేయనున్నారు. వీరందరికంటే ముందుగా వరుణ్ తేజ్ తన ‘మిస్టర్’ చిత్రంతో ఈ డిసంబర్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
 
 
CLICK HERE!! For the aha Latest Updates