HomeTelugu Trending'ఎంజీఆర్'గా అరవింద స్వామి ఫస్ట్‌లుక్‌

‘ఎంజీఆర్’గా అరవింద స్వామి ఫస్ట్‌లుక్‌

Arvind swamy first look fro
తమిళనాడు మాజీ సీఎం, దివంగత నటి జయలలిత బయోపిక్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తున్న ‘తలైవి’ సినిమాలో ఎంజీఆర్ పాత్ర‌ని అర‌వింద్ స్వామి పోషిస్తోన్న విషయం తెలిసిందే. ఎఎల్ విజయ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈమూవీ నుంచి అరవింద్ స్వామి ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సినిమాలో ఆయన ఎంజీఆర్ పాత్రలో ప్రజలకు నమస్తే చెబుతున్నట్లు ఈ లుక్ ఉంది. మరో లుక్ లో ఆయన పిల్లలతో కలిసి కూర్చొని భోజనం చేస్తున్నారు. ప్రకాశ్ రాశ్, భాగ్యశ్రీ కూడా ఇందులో కీలక పాత్రలలో కనిపించనున్నారు. కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ఎంజీఆర్ గా అరవింద్ స్వామి లుక్ ఆక‌ట్టుకుంటోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu