60 ఏళ్ల వయస్సులో రెండో పెళ్లి చేసుకున్న నటుడు

నటుడు అశిష్‌ విద్యార్థి గురించి ప్రత్యేకించి చెప్పనసరం లేదు. సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉండే ఈ టాలెంటెడ్‌ యాక్టర్‌ వెడ్డింగ్ అప్‌డేట్‌తో వార్తల్లో నిలిచి టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారాడు. 60 ఏండ్ల అశిష్‌ విద్యార్థి రెండో పెళ్లి చేసుకున్నట్టు సమాచారం.

తాజా అప్‌డేట్స్ ప్రకారం అశిష్‌ విద్యార్థి అసోంలోని గువాహటికి చెందిన రూపాలి బరువా ను పెళ్లి చేసుకున్నాడు. మే 25న (గురువారం) ప్రైవేట్‌ వెడ్డింగ్ సెర్మనీలో వీరిద్దరి వివాహం జరిగింది. అశిష్‌ విద్యార్థి రెండో వివాహానికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతుండగా.. దీనికి సంబంధించి పూర్తి వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది. అశిష్‌ విద్యార్థి ఇప్పటికే బెంగాలీ నటి శకుంతలా బరువా కూతురు రాజోషి బరువాను పెళ్లి చేసుకున్నాడు.

కాగా ఇప్పుడు రూపాలి బరువాను రెండో వివాహం చేసుకున్నాడు. రూపాలి ప్రస్తుతం కోల్‌కతాలో ఓ ఫ్యాషన్ స్టోర్‌ను నిర్వహిస్తుంది. మహేశ్ బాబు నటించిన పోకిరి, ఆగడు, పవన్‌ కళ్యాణ్ నటించిన గుడుంబా శంకర్‌ సినిమాలతో తెలుగులో సూపర్ పాపులర్‌ అయ్యాడు అశిష్‌ విద్యార్థి. అశిష్‌ విద్యార్థి యూట్యూబ్‌ ఛానల్‌లో పలు వీడియో వ్లోగ్స్‌తో దర్శనమిస్తుంటాడు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates