కుమార్తె ఫొటోలను షేర్‌ చేసిన అసిన్‌

ప్రముఖ నటి అసిన్ తన ముద్దుల కుమార్తె అరిన్‌ ఫొటోలను తొలిసారి సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. బాలీవుడ్‌తోపాటు దక్షిణాదిలోనూ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె మైక్రోమ్యాక్స్‌ సహ వ్యవస్థాపకుడు రాహుల్‌ శర్మను 2016లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి 2017లో అరిన్‌ అనే కుమారై జన్మించింది. గురువారం తమ గారాలపట్టి తొలి పుట్టినరోజు సందర్భంగా అసిన్‌, రాహుల్‌ చిన్నారి ఫొటోలను షేర్‌ చేశారు. ‘హ్యాపీ బర్త్‌డే అరిన్‌. తనకు ఏడాది నిండింది’ అని అసిన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా తీసిన ఫొటోలను ఇన్‌స్ర్టా స్టోరీస్‌లో పోస్ట్‌ చేశారు.

‘ఏడాది క్రితం మెరిసిపోయే కళ్లున్న అందమైన లిటిల్‌ ఏంజెల్‌ ఈ ప్రపంచానికి పరిచయం అయ్యింది. తనకు ఇప్పుడు ఏడాది.. కాలం పరుగులు పెడుతోందా?. నా కుమార్తె అరిన్‌కు హ్యాపీ బర్త్‌డే‌. ఎందుకంత త్వరగా ఎదిగిపోతున్నావ్‌? తొలి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. చిన్నారి పుట్టినప్పుడు తీసిన ఫొటోను, తాజా ఫొటోను షేర్‌ చేశారు.