HomeTelugu Newsఓంకార్ డైరెక్షన్‌లో 'అసురన్' తెలుగులో రీమేక్‌?

ఓంకార్ డైరెక్షన్‌లో ‘అసురన్’ తెలుగులో రీమేక్‌?

13ధనుష్‌ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన ‘అసురన్’ తమిళనాట భారీ విజయాన్ని నమోదు చేసింది. క్రితం నెల 4వ తేదీన విడుదలైన ఈ సినిమా, ధనుష్‌ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. అలాంటి ఈ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

వెంకటేష్‌ హీరోగా సురేశ్ ప్రొడక్షన్స్ – కలైపులి థాను సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి బయటికి వచ్చింది. ఈ సినిమాకి దర్శకుడిని కూడా సెట్ చేశారనేది తాజా సమాచారం. ‘రాజుగారి గది 3’ దర్శకుడు ఓంకార్ కి ‘అసురన్’ తెలుగు రీమేక్ బాధ్యతలను అప్పగిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ సురేశ్ బాబుకి – ఓంకార్ కి మధ్య చర్చలు జరిగాయని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu