HomeTelugu Trending'అశ్వద్ధామ' టీజర్‌ను విడుదల చేసిన సమంత

‘అశ్వద్ధామ’ టీజర్‌ను విడుదల చేసిన సమంత

5 25
యంగ్‌ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం ‘అశ్వద్ధామ’. దర్శకుడిగా రమణతేజ పరిచయమవుతున్న ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా సమంత చేతుల మీదుగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను విడుదల చేయించారు. “ఎలా వుంటాడో కూడా తెలియని ఒక రాక్షసుడు .. వాడికి మాత్రమే తెలిసిన ఒక రహస్యం .. వాడి కింద పనిచేసే సైన్యం .. గమ్యం తెలియని ఒక యుద్ధం .. ఆ యుద్ధం గెలవాలంటే ఒక ఆరడుగుల నారాయణాస్త్రం కావాలి” అంటూ వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ మొదలవుతోంది.

నాగశౌర్యకి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు. రఫ్ లుక్ తో నాగశౌర్య కనిపిస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే వున్నాయి. జనవరి 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. సొంత బ్యానర్ పై నాగశౌర్య చేస్తున్న ఈ సినిమా, ఆయనకి సక్సెస్ ను తెచ్చిపెడుతుందేమో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu