అతిథి పాత్రలో చిన్నారి పెళ్లికూతురు!

చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో ఫేమస్ అయిపోయిన అవికాగోర్.. ‘ఉయ్యాల జంపాల’
చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఆ తరువాత రాజ్ తరుణ్ తో
మరోసారి సినిమా చూపిస్తా మావ చిత్రంలో జతకట్టి రెండు హిట్ సినిమాలు తన ఖాతాలో
వేసుకుంది. ఆ తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ డైరెక్షన్ కోర్స్ నేర్చుకోవడానికి
అమెరికా వెళ్లిందనే వార్తలు వినిపించాయి. మరి ఆ సంగతి ఎలా ఉన్నా.. అమ్మడు మాత్రం
ఓ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనుందని సమాచారం. నిఖిల్ హీరోగా వి.ఐ.ఆనంద్
దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఎక్కడకి పోతావు చిన్నవాడా’. ఈ సినిమాలో హెబ్బా
పటేల్, నందిత శ్వేత హీరోయిన్స్ గా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్
రోల్ ఉందట. ఆ పాత్రలో అవికా కనిపించనుందని తెలుస్తోంది. అయితే ఆడియన్స్ కు తన
రోల్ సర్ప్రైజింగ్ గా ఉండాలని ఈ విషయాన్ని లీక్ చేయట్లేదని సమాచారం. మరి ఈ చిన్నది
ఈ పాత్రతో ఎలాంటి పేరు సంపాదిస్తుందో చూడాలి!