HomeTelugu TrendingAtlee: బాలీవుడ్ లో భారీ ప్లాన్ వేసిన అట్లీ..

Atlee: బాలీవుడ్ లో భారీ ప్లాన్ వేసిన అట్లీ..

Atlee
Atlee plans big in Bollywood

Atlee Bollywood Movie: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ మధ్యనే షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టారు. తెలుగు, తమిళ్లో కూడా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత అట్లీ ఇప్పుడు మరొక బాలీవుడ్ స్టార్ తో సినిమాని సైన్ చేశారు.

ఈసారి బాలీవుడ్ లోని మరొక ఖాన్ తో అట్లీ సినిమా చేస్తున్నారు. ఆయనే కండల వీరుడు సల్మాన్ ఖాన్. తాజాగా అట్లీ సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో సినిమా ఓకే అయింది. షారుక్ ఖాన్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చిన అట్లీ సల్మాన్ ఖాన్ కి కూడా అది పోయే హిట్ ఇస్తారని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సికందర్ సినిమాతో బిజీగా ఉన్నారు వచ్చే ఏడాది రంజాన్ సందర్భంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత సల్మాన్ ఖాన్ అట్లితో సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. అంటే ప్రస్తుతం క్యాస్టింగ్ పనుల్లో బిజీగా ఉన్న అట్లీ సినిమా కోసం మరొక బాలీవుడ్ స్టార్ ని రంగంలోకి దింపడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది ఒక ఇద్దరు హీరోల యాక్షన్ సినిమా అని సల్మాన్ ఖాన్ కాకుండా సినిమాలో రెండవ హీరోగా రన్వీర్ సింగ్ ని సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన టాక్స్ నడుస్తూ ఉన్నాయి. మరి రన్వీర్ సింగ్ కూడా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతాయని చెప్పుకోవచ్చు.

More about Atlee: రాజా రాణి సినిమాతో డైరెక్టర్ గా మారిన అట్లీ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా తరువాత విజయ్ తో తీసిన తేరి, మెర్సల్, బిగిల్ వంటి సినిమాలు కూడా మంచి విజయాలు అందుకోవడంతో అట్లీ కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు.

అసలైతే అట్లీ తెలుగులో అల్లు అర్జున్ హీరోగా ఒక సినిమా చేయాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా క్యాన్సిల్ అయిపోయింది. డైరెక్టర్ అట్లీ భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని, నిర్మాత కుదరదని చెప్పడంతో సినిమా నుంచి వాక్ అవుట్ చేశారని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరేమో అల్లు అర్జున్, అట్లీల మధ్యలో క్రియేటివ్ విభేదాల వల్లే సినిమా ఆగిపోయిందని అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!