నేను చెప్పాలనుకున్నదే లేఖలో రాశాను

వైసీపీ అధినేత జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్‌ని విశాఖ సెషన్స్‌ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. అనంతరం కోర్టు నుంచి తీసుకెళ్తుండగా నిందితుడిని మీడియా ప్రతినిధులు ఘటనపై పలు ప్రశ్నలు అడిగారు. దీంతో తాను చెప్పాలనుకున్నదే లేఖలో రాశానని పేర్కొన్నాడు. అందులోనే చూసుకోండి.. అంటూ తెలిపాడు. నిందితుడిని భారీ బందోబస్తు మధ్య పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు. నిన్న విశాఖ విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో ప్రతిపక్ష నేత జగన్‌పై నిందితుడు శ్రీనివాస్‌ కత్తితో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దాడి అనంతరం నిందితుడిని సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అదుపులోకి తీసుకోగా.. జగన్‌ హైదరాబాద్‌కు చేరుకొని ఓ ఆస్పత్రిలో చికిత్స పొంది ఈ మధ్యాహ్నం డిశ్చార్జి అయ్యారు.