అవికా పారితోషికం డబుల్ చేసింది!

సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఉండే స్పాన్ తో పోలిస్తే హీరోయిన్లకు చాలా తక్కువ లైఫ్ ఉంటుందనే చెప్పాలి. మహా అయితే పదేళ్ళు. అప్పటికి కూడా కొత్త తారలు రాకపోతేనే వారి హవా కొనసాగుతుంది. కొత్త వారోస్తే చెక్ పెట్టడం ఖాయం. అందుకే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలని మన హీరోయిన్లు భావిస్తుంటారు. కాజల్, నయనతార ఇలా చాలా మంది తారలు తమ క్రేజ్ ను బట్టి రెమ్యూనరేషన్ పెంచేస్తూ ఉంటారు. ఇప్పుడు చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ కూడా తన రెమ్యూనరేషన్ డబుల్ చేసింది.

కొన్ని రోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ ‘ఎక్కడకి పోతావు చిన్నవాడా’ చిత్రంలో అతిథి పాత్రలో మెరిసి అలరించింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం, అవికా పాత్రకు మంచి పేరు రావడంతో అమ్మడుకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో తన రేటును అమాంతం కోటిన్నర చేసిందని టాక్. ఇప్పటివరకు 60 లక్షల లోపే తీసుకునే ఈ భామ త్వరలోనే ఓ యంగ్ హీరో సినిమాలో నటించడం కోసం అంత మొత్తాన్ని తీసుకోబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా అవికా డ్యూయల్ రోల్ లో కనిపించబోతోందని సమాచారం.