HomeTelugu Trendingనిర్మాత మారిన అవికాగోర్‌

నిర్మాత మారిన అవికాగోర్‌

Avika gor turns producerతెలుగు ప్రేక్షకులకు ‘చిన్నారి పెళ్లికూతురు’గా పరిచయమై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది అవికాగోర్‌. ఈ బ్యూటీ తాజాగా నిర్మాతగా మారారు. అవికా స్క్రీన్స్‌ క్రియేషన్స్‌ పేరుతో ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించారు. ఆచార్య క్రియేషన్స్‌ అధినేత భోగేంద్ర గుప్తా మడుపల్లితో కలిసి, మురళీ నాగశ్రీనివాస్‌ గంధం దర్శకత్వంలో ఓ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో అవికా హీరోయిన్‌గా కూడా నటిస్తోంది. సాయిరోనక్‌ హీరో. అవికా గోర్‌ మాట్లాడుతూ ‘సినీ పరిశ్రమలోని అన్ని విభాగాలపై నాకున్న అవగాహనతోనే చిత్ర నిర్మాణంలో భాగస్వామినయ్యా. దర్శకుడు చెప్పిన కథ వినగానే చాలా నచ్చింది. నిర్మాతగా తొలి సినిమాకు ఇదే సరైన కథ అనిపించింది’ అని తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu