HomeTelugu Trendingఅవికా గోర్‌ పాప్ కార్న్' ట్రైలర్‌ విడుదల

అవికా గోర్‌ పాప్ కార్న్’ ట్రైలర్‌ విడుదల

Popcorn Trailer
తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి మరో ప్రేమకథ రెడీ అవుతోంది .. ఆ సినిమా పేరే ‘పాప్ కార్న్’. అవికా గోర్‌, సాయి రోనక్ హీరోహీరోయిన్‌లుగా నటించిన లవ్‌స్టోరీ ‘పాప్ కార్న్’. ఆచార్య క్రియేషన్స్ – అవికా స్క్రీన్ క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మించారు. మురళి గంధం ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను హీరో నాగార్జున విడుదల చేశారు. హీరో – హీరోయిన్ ఒక మాల్ లో ఉండగా బాంబు పేలుడు సంభవిస్తుంది. ఇద్దరూ కూడా ఆ మాల్ లోని లిఫ్టులో చిక్కుకుంటారు. ఆ లిఫ్ట్ లో నుంచి .. ఆ మాల్ లో నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారనేది కథ.

అవికా గోర్‌కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. అందువలన ఈ లవ్ స్టోరీ యూత్ కి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. శ్రావణ్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఫిబ్రవరి 10వ తేదీన విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu