HomeTelugu Trendingచిరంజీవి చిన్నల్లుడితో అవికా గోర్‌ రొమాన్స్‌

చిరంజీవి చిన్నల్లుడితో అవికా గోర్‌ రొమాన్స్‌

2 23
టాలీవుడ్‌లో ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ‘చిన్నారి పెళ్లికూతురు’ అవికా గోర్. ఆ సినిమాతో ప్రేక్షకుల ఆదరణ అందుకుంది. ‘సినిమా చూపిస్తమావ’తో మరో హిట్ ను సొంతం చేసుకున్న ఈ అమ్మాడు, తెలుగులో ఒక రేంజ్ లో దూసుకుపోతుందని అంతా అనుకున్నారు. కానీ తెలుగులో కాస్త బ్రేక్‌ తీసుకుంది.

అలా ‘రాజుగారి గది 3’ చేసిన అవికా, తాజాగా చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ జోడీగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ‘విజేత’ సినిమాతో తెలుగులో హీరోగా పరిచయమైన కల్యాణ్ దేవ్, ‘సూపర్ మచ్చి’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ తరువాత శ్రీధర్ సీపాన డైరెక్షన్‌లో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌ గా అవికా గోర్ ను తీసుకున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నరట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu