HomeTelugu Trendingఅయోధ్య రాముడిదే: సుప్రీంకోర్టు

అయోధ్య రాముడిదే: సుప్రీంకోర్టు

2 9అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని హిందువులు.. బాబ్రీ మసీదే నిర్మించాలని ముస్లింలు మధ్య మొదలైన వివాదానికి తాజాగా సుప్రీంకోర్టు పరిష్కారం కల్పించింది. ఐదుగురు సభ్యులతో కూడిన అత్యున్నత ధర్మాసనం అయోధ్య కేసుపై తీర్పు వెల్లడించింది 2.77 ఎకరాల స్థలంలో హిందువులకు, ముస్లిముల మధ్య తలెత్తిన వివాదం గత
70 ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ వివాదానికి తెర పడింది. సుప్రీంకోర్టు తీర్పుపై దేశం మొత్తం హర్షం వ్యక్తం చేస్తోంది.

సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు నేపథ్యంలో ప్రజలంతా సంయమనం పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు పటిష్ట బందోబస్తు నడుమ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. అయోధ్యలో వివాదాస్పద భూమిని కొన్ని షరతులతో హిందువులకు కేటాయించాలని తెలిపిన సుప్రీం కోర్టు…ముస్లిం లకు అయోధ్యలో
ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని తీర్పునిచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి ట్రస్ట్ ఏర్పాట్లు చేసి ఆలయ నిర్మాణాని చేపట్టాలని సూచించింది. మూడు నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది . కాగా వివాదాస్పద అయోధ్య భూమి పక్కనే సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదెకరాల ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని
సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఈ స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేటాయించాలని సూచించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu