ప్రభాస్‌కు పోటీగా మహేష్‌ ‘రామాయణం’?

టాలీవుడ్‌ హీరో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కూడా ఇతిహాసం నేపథ్యంలోనే ‘ఆదిపురుష్‌’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఓం రౌత్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావసణుడిగా, సీతగా కృతి సనన్‌ నటిస్తోంది. పాన్ ఇండియా స్ధాయిలో 3డీ టెక్నాలజీలో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి పోటీగా సూపర్ స్టార్ మహేష్‌ బాబు సినిమా రాబోతుందనే వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్‌, మధు మంతెన కలిసి రామాయణాన్ని 3డి ఫార్మాట్ లో తీయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ‘దంగల్‌’ దర్శకుడు నితీష్‌ తివారీ, ‘మామ్‌’ దర్శకుడు రవి ఉడయార్‌ దర్శకత్వం వహించనున్నారట. వాస్తవానికి రామాయణం ఇతీహాసం నేపథ్యంలో సినిమాను తెరకెక్కించబోతున్నట్లు మధు మంతెన, అల్లు అరవింద్‌ గతంలో అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమాని మూడు భాగాలుగా తెరకెక్కించబోతున్నామని, మొదటి భాగాన్ని 2021లో విడుదల చేస్తామని చెప్పారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. ఇప్పుడు ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ చేస్తున్న తరుణంలో మరోసారి ఈ ప్రాజెక్టు వార్తల్లో నిలిచింది. మహేష్‌తో ఈ ప్రాజెక్టుని తెరకెక్కించాలని నిర్మాతలు మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు గురించి ఆయనతో చర్చలు మొదలు పెట్టినట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో సీతగా దీపికా పదుకోన్‌, రావణుడ హృతిక్‌ రోషన్‌ నటించబోతున్నట్లు వినికిడి‌. ఇది ఎంతవరకు నిజమో చూడాలి.

CLICK HERE!! For the aha Latest Updates