HomeTelugu Trendingసీనియర్‌ కమెడీయన్‌ రీఎంట్రీ

సీనియర్‌ కమెడీయన్‌ రీఎంట్రీ

Babu mohan re entry with ku
టాలీవుడ్‌లో సీనియర్‌ కమెడీయన్‌ల్లో బాబు మోహన్‌ ఒకరు. కోట శ్రీనివాస్‌తో కలిసి సినిమాల్లో ఆయన చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ వాళ్ల సీన్స్‌ చూస్తుంటే ఇట్టే నవ్వు పెదాలపైకి వచ్చేస్తుంది. అంతలా నవ్వించారు. ఒకనొక టైమ్‌లో స్టార్‌ కమెడీయన్‌గా ఎదిగిన బాబు మోహన్‌కు ఉన్నంటుండి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.

ఆ తరువాత అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తూనే వచ్చాడు. అయితే గత కొన్నేళ్లుగా బాబు మోహన్‌ సినిమాలకూ దూరంగా ఉన్నాడు. కాగా తాజాగా నిత్యామీనన్‌ హీరోయిన్‌గా నటించిన శ్రీమతి కమారి సినిమాలో బాబు మోహన్‌ జడ్జీ పాత్రలో కనిపించాడు. తాజాగా రిలీజైన ట్రైలర్‌లో బాబు మోహన్‌ సెకన్ల పాటు స్క్రీన్‌పై కనిపించి సంతోష పరిచాడు. మరో రెండు రోజుల్లో ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానున్న ఈ వెబ్‌ సిరీస్‌పై ఓటీటీ ప్రియుల్లో మంచి ఆసక్తే నెలకొంది.

దానికి తోడు టీజర్‌, ట్రైలర్‌లు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కట్టిపడేశాయి. తాము ఎంతో ఇష్టపడే పాత ఇల్లును నిత్యామీనన్‌ వాళ్ల బాబాయ్‌ అన్యాయంగా లాక్కుంటాడు. ఆ ఇల్లును దక్కించుకోవాలంటే 6 నెలలోగా వాళ్ల బాబాయ్‌కు 38లక్షలు కట్టాల్సివస్తుంది. నెలకు 13వేలు సంపాదించే నిత్యా.. ఆ ఇల్లును ఎలాగైన దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అంత తక్కువ టైమ్‌లో ఎక్కువ డబ్బులు కావాలంటే బార్‌ పెట్టడం కరెక్ట్‌ అని భావించి ఊర్లో బారును ఓపెన్‌ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనే కాన్సెప్ట్‌తో చాలా ఫన్నీగా ఈ సిరీస్‌ను రూపొందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!