HomeTelugu Trending‘బ్యాడ్‌ లక్‌ సఖి’సాంగ్‌ విడుదల

‘బ్యాడ్‌ లక్‌ సఖి’సాంగ్‌ విడుదల

bad luck sakhi song from go

కీర్తిసురేశ్‌ నటించిన తాజా చిత్రం ‘గుడ్‌ లక్‌ సఖి’. మహిళా ప్రాధాన్యమున్న ఈ సినిమా గ్రామీణ క్రీడా నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి నగేష్‌ కుకునూర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘బ్యాడ్‌ లక్‌ సఖి’ ఫుల్‌ వీడియో పాటను నటుడు రానా విడుదల చేసి చిత్రబృందం మొత్తానికి అభినందనలు తెలిపారు. సినిమాలో కీర్తి సురేశ్‌ పాత్ర గురించి తెలియజేసేలా ఈ పాటను తెరకెక్కించారు. ఆమెను ఓ దురదృష్టవంతురాలిగా చూపించారు.

‘అదిగో వస్తుంది బ్యాడ్‌ లక్‌ సఖి’ అంటూ సాగే ఈపాటను హరిప్రియ, సమీరా భరద్వాజ్‌, ఎంఎల్‌ఆర్‌ కార్తికేయన్‌ ఆలపించారు. దిల్‌రాజు సమర్పణలో వర్త్‌ ఏ షాట్‌ మోషన్‌ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్‌చంద్ర పాదిరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జగపతిబాబు, ఆది పినిశెట్టి ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా నవంబర్‌ 26న విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu