జయం రీమేక్‌!

టాలీవుడ్‌లో 2002లో వచ్చిన ‘జయం’ సినిమా ఎంతటి పెద్ద హిట్టైందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నితిన్, సదా ఈ సినిమాతో హీరోహీరోయిన్‌లుగా పరిచయమైయ్యారు. తేజా డైరక్షన్‌లో వచ్చిన ఈ సినిమా లవ్యాక్షన్ డ్రామాగా అప్పటి కుర్రకారుని ఓ ఊపు ఊపేసింది. వెళ్లవయ్యా..వెళ్లు అంటూ హీరోయిన్ సదా చెప్పే డైలాగ్‌ ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లోనే బాగా కలెక్ట్ చేసింది. కాగా 20 ఏళ్ళ తరువాత ఈ సినిమాని కన్నడలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ రీమేక్‌కు ‘కేజీఎఫ్’ యశ్ను తొలి రోజుల్లో హీరోగా పరిచయం చేసిన శశాంక్ డైరక్ట్ చేయనున్నారు. యశ్ కు దేశవ్యాప్త గుర్తింపు రావటంతో ఆయన్ని హీరోగా లాంచ్ చేసిన శశాంక్ ది లక్కీ హ్యాండ్ అని అక్కడ సినిమా జనం పడుతున్నారు. అలాగే హీరోగా కర్ణాటకకు చెందిన ప్రవీణ్ కుమార్ అనే డాక్టర్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కన్నడలో ఓ సినిమా చేస్తున్న ప్రవీణ్ ఆ తర్వాత జయం రీమేక్లో నటించనున్నట్లు సమాచారం.

CLICK HERE!! For the aha Latest Updates