HomeTelugu Trending'గుడ్‌ లక్‌ సఖి' మూవీ టీజర్‌

‘గుడ్‌ లక్‌ సఖి’ మూవీ టీజర్‌

Good luck sakhi movie tease
‘మహానటి’ ఫేమ్‌ కీర్తిసురేశ్‌, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గుడ్‌ లక్‌ సఖి’. నాగేష్‌ కుకునూరు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్‌ను ఈ రోజు (శనివారం) ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు.

కీర్తిసురేశ్‌ మరోసారి విభిన్నమైన పాత్రను ఎంచుకున్నారు. అదృష్టం లేని ఒక పల్లెటూరి అమ్మాయి ఏకంగా రైఫిల్‌ షూటింగ్‌లో ఉన్నత శిఖరాలను ఎలా చేరుకున్నదనే విషయాన్ని అలరించేలా తీర్చిదిద్దినట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. నటుడు జగపతి బాబు ఇందులో కీలక పాత్ర లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. దిల్‌రాజ్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని సుధీర్‌, శ్రావ్య వర్మ నిర్మిస్తున్నారు. సీనియర్‌ నటి రమాప్రభ, రాహుల్‌ రామకృష్ణ, తదితరులు నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu