Bad Newz OTT:
2024లో విడుదలైన రొమాంటిక్ కామెడీ చిత్రం బ్యాడ్ న్యూస్ ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైంది. విక్కీ కౌశల్, త్రిప్తి డిమ్రీ, అమ్మి విర్క్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం జూలై 19, 2024న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. కామెడీ, బాగా హిట్ అయిన పాటలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.
సినిమా విడుదల అయిన దాదాపు నెల రోజుల తర్వాత ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. అయితే బ్యాడ్ న్యూస్ ప్రేక్షకులకు సాధారణ స్ట్రీమింగ్ లైబ్రరీలో కాకుండా కేవలం రెంటల్ ఆప్షన్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది. అంటే సినిమాను చూడటానికి ప్రేక్షకులు రూ. 349 చెల్లించి రెంట్ కి తీసుకుని సినిమాను చూడాల్సి ఉంటుంది.
ఈ సినిమా స్ట్రీమింగ్ రూల్స్ ప్రకారం, ఒకసారి రెంట్ చేసుకున్న తర్వాత 48 గంటలలో సినిమాను చూడాలి. నేహా ధూపియా కీలక పాత్రలో కనిపించిన ఈ సినిమాలో అనన్య పాండే, నేహా శర్మ క్యామియో పాత్రల్లో కనిపించారు.
ఆనంద్ తివారి దర్శకత్వంలో ఇషితా మొయిత్రా, తరుణ్ దుడేజా రచనలో తెరకెక్కిన ఈ సినిమాను హిరూ యష్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, అమృత్‌పాల్ సింగ్ బింద్రా, ఆనంద్ తివారిలు నిర్మించారు.