బాహుబలి2 లో ఆ సీన్లే హైలైట్!

తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రం బాహుబలి. ఈ సినిమా రెండో భాగంపై మంచి
అంచనాలే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎదురుచూసే వారున్నారు
అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో రెండు సీన్లు సినిమాకు
హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. ప్రభాస్-అనుష్క, రానా-అనుష్క ల మధ్య
రెండు కత్తి యుద్ధ సన్నివేశాలను రూపొందించాడట దర్శకుడు రాజమౌళి. అందులో
రానా, అనుష్కల మధ్య జరిగే యుద్ధంలో అనుష్కనే గెలుస్తుందట. దీని బట్టి జక్కన్న
ఈ ఫైట్ ను ఒక రేంజ్ లో రూపొందించాడని తెలుస్తోంది. మొన్నటివరకు అనుష్క బరువు
పెరిగిపోవడంతో సినిమాలో తన పాత్ర నిడివి తగ్గించారని మాటలు వినిపించాయి. కానీ
ఇప్పుడు ఈ వార్తల బట్టి అనుష్కను మరొక స్థాయిలో రాజమౌళి చూపించబోతున్నట్లు
తెలుస్తోంది.

CLICK HERE!! For the aha Latest Updates