‘బాహుబలి2’ కూడా లీక్ చేశారు!

సినిమా ఇండస్ట్రీలో లీకుల కలకలం ఎక్కువైంది. తాజాగా బాహుబలి2 సినిమాకు సంబంధించి రెండున్నర నిమిషాల వార్ ఎపిసోడ్ లీకైనట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశాలని ఆన్ లైన్ లో చూసిన చిత్రబృందం ఒక్కసారిగా షాక్ అయిందట. వెంటనే ఆ సన్నివేశాలని తొలగించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. లీకైన వీడియోలో ప్రభాస్, అనుష్క గెటప్పులు కొన్ని యుద్ధ సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

బాహుబలి ది బిగినింగ్ సినిమాలో కొన్ని సీన్లు కూడా ఇలానే రిలీజ్ కు ముందు లీకయ్యాయి. అప్పుడు కూడా చిత్రబృందం ఇలానే సన్నివేశాలు తొలగించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఒక వ్యక్తి లీక్ చేశారని తెలుసుకున్న పోలీసులు ఆయనపై చర్యలు తీసుకున్నారు.

మరి ఈ సారి ఎవరు లీక్ చేశారో చూడాలి. దర్శకుడు రాజమౌళి ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయినప్పటికీ సినిమాను లీక్ చేయడం వదిలిపెట్టట్లేదు కొందరు. మరి ఈ విషయం పట్ల చిత్రబృందం ఎలా స్పందిస్తుందో చూడాలి!