హ్యాపీ బర్త్ డే మై బోయ్‌: చిరంజీవి


టాలీవుడ్ లో మెగాస్టార్‌ చిరంజీవి వారసుడిగా చిరుత సినిమా ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. ఆ తరువాత తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకుని స్టార్‌ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం చరణ్‌ రాజమౌళితో ఆర్.ఆర్.ఆర్‌లో నటిస్తున్నాడు. ఇక శంకర్ దర్శకత్వంలోని ఓ సినిమా కూడా ప్రకటించాడు. అయితే అంత పెద్ద స్టార్ అయినా కానీ.. ఇప్పటికీ ఎప్పటికీ ఒదిగి ఉండేవాడిగా అందరి మన్ననలు అందుకుంటున్నారు. చరణ్ సింప్లిసిటీ, కుటుంబానికి ఇచ్చే ప్రాధన్యత ఆయనకు అభిమానులకు మరింత దగ్గర చేస్తుంది.

నేడు (మార్చి 27)తో రామ్ చరణ్ 36వ బర్త్‌డే. ఈ సందర్భంగా అభిమానుల నుంచి కుటుంబ సభ్యుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తాజాగా ఆయన తండ్రి చిరంజీవి చెర్రీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే మై బోయ్..! అంటూ చిరు షేర్ చేసిన ఓ స్పెషల్ ఎమోషనల్ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది.

CLICK HERE!! For the aha Latest Updates