HomeTelugu Trendingబలగం ఖాతాలో మరో అంతర్జాతీయ అవార్డు..

బలగం ఖాతాలో మరో అంతర్జాతీయ అవార్డు..

balagam venu wins internati

చిన్న సినిమాగా విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం ‘బలగం’. తెలంగాణ సంస్కృతి, ప్రజల అనుబంధాల కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. కేవలం రూ. 2 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా టీమ్ కృషికి అంతర్జాతీయంగా అభినందనలు అందుతున్నాయి. జబర్దస్త్ కమెడియన్ వేణు యెల్దండి తొలిసారి మెగాఫోన్ పట్టి ‘బలగం’ అనే బ్లాక్ బస్టర్ సినిమాను తీశాడు. ఇప్పటికే

ఈ చిత్రం పలు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఇప్పటి వరకు లాస్ ఏంజెలెస్ సినిమాటోగ్రఫీ నుంచి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఉక్రెయిన్ కు చెందిన ఒనికో ఫిల్మ్ అవార్డ్స్ నుంచి బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డును గెలుచుకుంది. డీసీ ఇంటర్నేషనల్ సినిమా ఫెస్టివల్ లో ఏకంగా నాలుగు అవార్డులు వచ్చాయి. తాజాగా ఉత్తమ దర్శకుడిగా వేణు అంతర్జాతీయ అవార్డును సాధించాడు.

తాజాగా మరో పురస్కారాన్ని దక్కించుకుంది. ఆమ్‌స్టర్‌డామ్‌లోని అరౌండ్ ఇంటర్నేషనల్అవార్డ్స్‌లో వేణు యెల్దండి ఉత్తమ దర్శకుడిగా అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డు రావడం పట్ల వేణు ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రచ్చ రవి సహా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి ఈ రూరల్ ఎమోషనల్ డ్రామాని నిర్మించారు.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu